Devara Collections: ‘దేవర’ 3 వారాల కలెక్షన్స్.. ప్రాఫిట్ ఎంత?

Advertisement

ఎన్టీఆర్  (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ  (Koratala Siva)  కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన చిత్రం ‘దేవర’ (Devara) . సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరుసగా సెలవులు రావడం, దావూది సాంగ్ యాడ్ అవ్వడం ‘దేవర’ కి ప్లస్ అయ్యాయి. దసరాకి విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడకపోవడంతో ‘దేవర’ లాంగ్ రన్ కి ఇంకో రకంగా హెల్ప్ అయ్యింది అని చెప్పవచ్చు.

Devara Collections

ఇక గడిచిన 3 వారాలకు గాను ‘దేవర’ (Devara) కలెక్షన్స్, అలాగే ప్రాఫిట్స్ గురించి ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 57.17 cr
సీడెడ్ 29.47 cr
ఉత్తరాంధ్ర 16.78 cr
ఈస్ట్ 9.61 cr
వెస్ట్ 7.47 cr
గుంటూరు 11.87 cr
కృష్ణా 8.50 cr
నెల్లూరు 5.66 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 146.57 cr
కర్ణాటక 15.25 cr
తమిళనాడు 2.48 cr
కేరళ 0.76 cr
నార్త్ 27.55 cr
 ఓవర్సీస్ 34.96 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 227.57 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 3 వారాలు పూర్తయ్యేసరికి రూ.227.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.52.57 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.

‘జనక అయితే గనక’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus