శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో జి. మంజునాధ్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “మా ఊరి సిన్మా”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్న ప్రసాద్ లాబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్, తదితరులు పాల్గొని సినిమా బాగుందని ప్ర శoసించారు.
ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ ” మా ఈ కార్యక్రమానికి పులివెందుల నుంచి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరి సినిమా బాగుందని , సిన్మా చూసిన పెద్దలు అభినందిస్తూ వుంటే ఆనందం గా వుంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను. ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలుపుకంటున్నాను . అని అన్నారు.
చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ” మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.”అన్నారు.
హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ” మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం వుంది. బావ మరదళ్ల ఆప్యాయత వుంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో వున్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.