ధ‌నుష్ “మారి2” చిత్ర ఆంధ్రా, సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్న ఐకాన్ మూవీస్‌

ధ‌నుష్ హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి2.. ఈ చిత్రం మారి కి సీక్వెల్ గా వ‌స్తుంది. ఇప్ప‌టికే మారి కి వున్న క్రేజ్ ఈ సీక్వెల్ మారి2 కి మార్కెట్ లో క్రేజ్ ని తీసుకువ‌చ్చింది. మారి2 టీజ‌ర్స్‌, పోస్ట‌ర్స్ కి , విడ‌దులయ్యిన సాంగ్స్ కి సూప‌ర్‌ రెస్పాన్స్ రావ‌టంతో ఫ్యాన్సిరేట్ల‌కే బ‌య్య‌ర్స్ కొనుగొలు చేయ‌టం విశేషం. ఈ చిత్రాన్ని ఆంధ్రా, సీడెడ్ హ‌క్కుల‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ ఐకాన్ మూవీస్ అదినేత శ్రీరామ్ గారు విడుద‌ల చేస్తున్నారు. ఈచిత్రాన్ని డి.ప్ర‌తాప్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో, ధ‌నుష్ నిర్మాత‌గా బాలీజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న గ్రాండ్ గా విడుద‌ల అవుతుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మారి2 లో ఓ సాంగ్ ని ప్ర‌ముఖ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు లెజెండ్ ఇల‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. అలాగే ఓ సాంగ్ ని ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫి చేయ‌టం విశేషం. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, హీరో ధ‌నుష్ మాట్లాడుతూ.. మారి చిత్రం చాలా పెద్ద స‌క్సస్ ని సాధించింది. ఇప్ప‌డు దానికి సీక్వెల్ గా మారి2ని విడుద‌ల చేస్తున్నాము. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్స్ , పోస్ట‌ర్స్, సాంగ్స్‌ త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని అక‌ట్టుకుంటుంది. ఇళ‌య‌రాజా గారు ఓక సాంగ్ ని పాడ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ప్రభుదేవా కొరిగ్ర‌ఫి అందించ‌టం కూడా చాలా ఆనందంగా వుంది.. అని అన్నారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus