విశాల్ (Vishal) హీరోగా అంజలి (Anjali), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ'(Madha Gaja Raja). సుందర్ సి (Sundar C) డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2012 లోనే రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే 12 ఏళ్ళ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అక్కడ పోటీగా సినిమాలు లేకపోవడం వల్ల ఎగబడి చూశారు. సంతానం,మనోబాల కామెడీ వర్కౌట్ అవ్వడంతో పాటు హీరోయిన్ల గ్లామర్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చినట్టు అయ్యింది.
అందుకే అక్కడ రూ.50 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. జనవరి 31న తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ వసూళ్లు అనుకున్న స్థాయిలో లేవు. ఒకసారి (Madha Gaja Raja) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.26 cr |
సీడెడ్ | 0.13 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.66 cr |
‘మదగజరాజ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 4 రోజులు ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.66 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.84 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఉన్నంతలో బిలో యావరేజ్ ఓపెనింగ్స్ ను అయితే ఈ సినిమా సాధించింది కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే రేంజ్లో అయితే కాదు.