Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తమిళ స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఒక్క హిట్టు కొట్టలేక విలవిలలాడుతున్నారు.కె.ఎస్.రవికుమార్, లింగుస్వామి,వెంకట్ ప్రభు నుండి లెక్కేసుకుంటే స్టార్ డైరెక్టర్ శంకర్ వరకు చాలా మంది ఈ లిస్టులో ఉన్నారు. శంకర్ కూడా ఆల్మోస్ట్ ఫేడౌట్ దశకు దగ్గరయ్యారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Murugadoss

ఆయనతో పాటు ఏ.ఆర్.మురుగదాస్ కూడా ఈ లిస్టులో చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అవును ‘కత్తి’ తర్వాత మురుగదాస్ కెరీర్లో సరైన హిట్టు పడలేదు. ‘సర్కార్’ కమర్షియల్ గా గట్టెక్కినా.. కంటెంట్ పరంగా ట్రోల్స్ ఎదుర్కొంది. తర్వాత మురుగదాస్ నుండి వచ్చిన ‘దర్బార్’ ‘సికందర్’ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి.ముఖ్యంగా ‘సికందర్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి హీరో సల్మాన్ ఖాన్ కారణం అంటూ మురుగదాస్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో మురుగదాస్ నెక్స్ట్ మూవీ ‘మదరాసి’ ఫలితం గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంతగా ఆసక్తి క్రియేట్ చేయలేదు. పైగా అవి మురుగదాస్ ‘తుపాకీ’ స్టైల్లోనే ఉన్నాయి అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అయితే హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. అతను రెగ్యులర్ సినిమాలు చేసే రకం కాదు. మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర కూడా సంపాదించుకున్నాడు. మరోవైపు ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించాడు. కంటెంట్ సో సోగా ఉన్నా.. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గట్టెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో మురుగదాస్ యావరేజ్ కంటెంట్ డెలివరీ చేసినా అనిరుధ్, శివ కార్తికేయన్ తమ భుజాలపై ఈ సినిమా ఫలితాన్ని మోసే అవకాశం ఉంది.

‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus