సౌత్ ఇండియాలో మాధవన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా స్టార్ గా ఎదిగి.. తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆయనొక ప్రాజెక్ట్ చేపట్టాడు. అదే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు మాధవన్. అంతేకాదు.. నిర్మాణ భాగస్వామి కూడా.
కొన్నినెలల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. దీంతో జనాలు ఈ సినిమా గురించి మర్చిపోతున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడాడు మాధవన్. ‘రాకెట్రీ’ తన కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అని.. ఎంతో కష్టపడి ఈ సినిమాను తీశామని.. పరిస్థితులు బాగాలేక రిలీజ్ ఆపామని చెప్పాడు.
దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునేవరకు సినిమాను రిలీజ్ చేయలేమని.. ఉత్తరాదిన కూడా ఈ సినిమా మంచి ప్రభావం చూపుతుందని.. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకోనప్పుడు సినిమాను ఎలా విడుదల చేస్తామని మాధవన్ ప్రశ్నించాడు. సాధారణ పరిస్థితులు రాగానే ‘రాకెట్రీ’ రిలీజ్ అవుతుందని వెల్లడించాడు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!