మలయాళ సినిమాలో నటించనున్న మాధవన్..?

“సాలా ఖద్దూస్” అనంతరం మరో సినిమాలో నటించడానికి అంగీకరించని మాధవన్ ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. హాలీడేస్ పూర్తయిన అనంతరం ఓ మలయాళ చిత్రంలో కీలకపాత్ర పోషించేందుకు మాధవన్ సమ్మతించినట్లు తెలుస్తోంది.

ప్రతాప్ పోతేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో దుల్హర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సల్మాన్ తో కలిసి మాధవన్ ఈ చిత్రంలో నటించనున్నాడు. సుప్రియా ఫిల్మ్ కార్పొరేషన్, రాజపుత్ర విజువల్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. జులై నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. బెంగళూరు డేస్ ఫేమ్ అంజలి మీనన్ ఈ చిత్రానికి కథ అందిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags