సావిత్రిగా ఛార్మి చక్కగా సరిపోతుంది : మాధవి లతా.!

అభినేత్రి సావిత్రి జీవితంలోని అనేక విషయాలను మనం త్వరలో వెండితెరపై చూడబోతున్నాం. యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సావిత్రిపై బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న మహానటిలో కీర్తిసురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా, సమంత జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. జెమినీ గణేషన్‌ పాత్రను యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌,  మాయాబజార్ డైరక్టర్ కేవీ రెడ్డి గా క్రిష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ సూట్ కాదని నచ్చావులే హీరోయిన్ మాధవీలత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

కీర్తి పేరు ఎత్తకుండా సావిత్రి పాత్ర‌కు ఆమె అస‌లు సూట్ కాద‌ని సంచలన కామెంట్స్ చేసింది. “మ‌హాన‌టి సావిత్రిగారి క‌ళ్లు ఎంత పెద్ద‌వి. ఆమె పెద‌వులు కూడా ఎంత బాగుంటాయి. కానీ, ఇప్పుడు సావిత్రిగారి పాత్ర‌లో న‌టిస్తున్న అమ్మాయి ఆ పాత్ర‌కు అస‌లు సూట్ కాదు. ఆమె అందానికి ఈమె స‌రిపోదు. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి కంటే ఛార్మి సావిత్రిగారి పాత్ర‌కు సూట్ అవుతుంద‌నిపిస్తోంది. సావిత్రి గారి పాత్ర పోషించే అమ్మాయికి పెద్ద క‌ళ్లు, అంద‌మైన పెద‌వులు, తీరైన ముక్కు, గుండ్ర‌టి మొహం త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉండాలి. అందుకే ఆ పాత్ర‌కు ఛార్మి స‌రిపోతుంద‌నుకుంటున్నాను” అని వెల్లడించింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించి వార్తల్లో నిలిచిన మాధవి ఈ కామెంట్స్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus