పవన్ కళ్యాణ్ కి అయితే చచ్చినా చేయను : మాధవీ లత

  • August 26, 2019 / 06:50 PM IST

ఈ సంవత్సరం ఏప్రిల్ లో జరిగిన ఏపీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం , బీజేపీ పార్టీ నుండీ ప్రముఖ సినీ నటి మాధవీలత పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘నేను ఓడిపోయినా పర్వాలేదు… కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం చాలా విడ్డూరంగా ఉంది. డబ్బిస్తేనే ఓటు వేస్తాం… మాకు నిజాయితీ పరులొద్దు అని ఏపీ ప్రజలు బాగా చెప్పారు’ అంటూ అప్పుడు పవన్ కు మద్దతు తెలుపుతూ ఈమె చేసిన కామెంట్స్ కు అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోయి ఈమెను తెగ పొగిడేశారు. ఇప్పుడు మరోసారి పవన్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది మాధవీ లత.

ఇటీవల ఆమె ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… “పవన్ కళ్యాణ్ గారు నా 15 ఏళ్ళ క్రష్. నా లవ్. ఎప్పుడు ఆయన్ని కలిసే రోజు వస్తుందా… ఆయనతో ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ఆయన చాలా స్పెషల్. హీరోలకు చెల్లెలి పాత్రలు అస్సలు చేయను. ఒకవేళ ఫ్రెండ్ రోల్స్ అయితే చేస్తాను. ఒకవేళ మిగిలిన హీరోలకి చెల్లెలి పాత్ర చేయాల్సి వచ్చినా… పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చచ్చినా చేయను” అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. ఇక మాధవీ లత ‘నచ్చావులే’ ‘స్నేహితుడా’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు నటించిన ‘అతిధి’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది మాధవీ లత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus