బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు రేయాన్ చేసిన పనికి నెటిజన్లు అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. నేషనల్ క్యాన్సర్ అవేర్‌నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా క్యాన్సర్ బాధితుల కోసం తన జుట్టుని దానం చేసి వార్తల్లో నిలిచాడు రేయాన్. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన మాధురి దీక్షిత్.. శ్రీరామ్ నెనెను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది.
అలానే టీవీ షోలలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను మైమరిపిస్తోంది. ఆమె చిన్న కుమారుడు రేయాన్ తన పొడవైన జుట్టుని కీమో థెరపీ చేయించుకున్న పేషంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్ లో రేయాన్ హెయిర్ కట్ చేయించుకున్న వీడియో షేర్ చేశారు మాధురి దీక్షిత్. క్యాన్సర్ బారిన పది కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి రేయాన్ చలించిపోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టుని క్యాన్సర్ సొసైటీకి డాన్ చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు.
ఇది విని తల్లి తండ్రులుగా ఆశ్చర్యపోయామని.. అలానే గర్వపడ్డామని చెప్పుకొచ్చారు. దాదాపు రెండేళ్లుగా పెంచుకుంటున్న తన జుట్టుని డొనేట్ చేయడంపై చాలా గర్వంగా ఉందని అన్నారు మారుతి. రేయాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ హీరో అంటూ రేయాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.