శ్రీదేవికి చివరి కోరికను పక్కన పెట్టేస్తున్న బోణీ కపూర్ ..?

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి సంవత్సరం పూర్తవుతుంది. ఇదిలా ఉండగా ‘శ్రీదేవి’ బయోపిక్ ని రూపొందించాలని బోనీకపూర్ ప్లాన్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినట్టుకూడా బోణి కపూర్ తెలిపారు. అయితే ప్రస్తుతానికైతే శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించే ఆలోచన లేదని బోనికపూర్ స్పష్టం చేసినప్పటికీ ఈ రూమర్స్ ఆగట్లేదు. ఇక ఈ బయోపిక్ లో తన పెద్ద కూతురు… జాన్వీ కపూర్ శ్రీదేవి పాత్ర పోషించబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. తన బయోపిక్ అంటూ తీస్తే అందులో తన పెద్ద కూతురు జాన్వీ కపూరే నటించాలని శ్రీదేవి కోరికట.

అయితే నిండా 25 ఏళ్ళు కూడా లేని జాన్వీ కపూర్ శ్రీదేవి పాత్రను పోషించడం అంత సులభం కాదని కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీదేవి అంటేనే… అద్భుతమైన హావభావాలు .. డైలాగ్ డెలివరీ .. డ్యాన్సులకి .. పెట్టింది పేరు అని అందరికి తెలిసిందే. ఇలా అన్నింటిలోనూ ప్రేక్షకులను మెప్పించగల సామర్థ్యం కావాలి కాబట్టి …. శ్రీదేవి పాత్ర ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అయితేనే మెప్పించగలదని బోనీకపూర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు… ఇప్పటికే మాధురి దీక్షిత్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. బయట కూడా బోనీకపూర్,అనిల్ కపూర్లతో మాధురి దీక్షిత్ కు మంచి స్నేహితులని అందరికీ తెలిసిన సంగతే..! ఈ కారణంగా మాధురి దీక్షిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus