తాజాగా చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ వేడుకలో.. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ పై రజినీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ..”1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీ అందరూ ఓసారి గుర్తుచేసుకోవాలి. అప్పట్లో పెరియార్… సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్ళారు. ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది” అంటూ రజినీ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కారణంగా రజనీ పై కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు.
‘ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ పై రజినీ చేసిన వ్యాఖ్యలు కారణంగా రజినీ పై చర్యలు తీసుకోవాలని.. ‘ద్రావిడర్ విడుదలై కళగం’ వారు పిటిషన్ దాఖలు చేసినట్టు చెన్నై పోలీసులు తెలిపారు. మతం పేరుతో తమిళనాడు ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు, అశాంతిని రెచ్చగొట్టేందుకు రజినీ ప్రయత్నించారంటూ పిటిషన్‌లో ఆరోపించింది. అయితే ఈ విషయం పై మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాలి కానీ.. హైకోర్టుకు రావాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది.
డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!