సినిమా హీరో అవ్వాలంటే డైరక్షన్, సినిమా మేకింగ్ విషయంలో పరిజ్ఞానం ఉండాలా? ఏమో మరి మన స్టార్ హీరోల తనయులు, తనయలు చాలామంది ఇలా నటనలోకి అరంగేట్రం చేసే ముందు దర్శకత్వ శాఖలో పని చేస్తున్నారు. ఇప్పుడు యువ నటులుగా ఉన్న చాలామంది స్ట్రెయిట్ నటులు, నెపో కిడ్స్‌లో గతంలో సినిమా టేకింగ్‌లో అనుభవం సంపాదించినవాళ్లే. ఈ కోవలోనే మాస్ మహారాజ తనయుడు మహాధన్ కూడా సినిమాల కోసం పని చేస్తున్నాడు.
మొన్నీమధ్య వరకు సందీప్ రెడ్డి వంగా దగ్గర ‘స్పిరిట్’ సినిమా కోసం దర్శకత్వ శాఖలో పని చేసిన మహాధన్.. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా సెట్స్‌లో పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని వెంకీ అట్లూరినే వెల్లడించారు. రవితేజ ‘మాస్ జాతర’ సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇటీవల వచ్చింది. అందులో హోస్ట్ వెంకీనే. ఆ ఇంటర్వ్యూలో ‘నా కొడుకు ఎలా ఉన్నాడు’ అని రవితేజ అడిగాడు. దానికి వెంకీ అట్లూరి ‘మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు’ అని అసలు విషయంలో చెప్పి క్లారిటీ ఇచ్చేశారు.
‘మాస్ జాతర’ సినిమాను నిర్మించిన నాగవంశీనే.. సూర్య – వెంకీ సినిమాను కూడా నిర్మిస్తున్న విషయం తెలసిందే. ఆ పరిచయంతోనే ఆ సినిమా కోసం మహాధన్‌ను ఏడీగా తీసుకుని పని నేర్పిస్తున్నట్లు సమాచారం. రవితేజ కూడా కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే నటనలోకి అడుగు పెట్టి హీరోగా ఈ రేంజికి వచ్చాడు. మరి తండ్రి బాటలో అడుగులు వేస్తున్న మహాధన్ నెక్స్ట్‌ఏమవుతాడు, ఎలా అవుతాడు అనేది చూడాలి.
మరోవైపు రవితేజ తనయ నిర్మాణ రంగంలోకి వచ్చారట. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఆమె మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు సొంతంగా సినిమా చేస్తారట. మరి రవితేజ నిర్మాణ ఆర్టీ టీమ్ వర్క్స్‌లో సినిమాలు చేస్తుందా లేక సొంత నిర్మాణ సంస్థ పెడతారా అనేది చూడాలి.