Mahanati Collections: ‘మహానటి’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

తెలుగు,తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటి సావిత్రి జీవిత ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ నటించింది. నిజానికి నటించింది అనే కంటే జీవించింది అనే చెప్పాలి. ఈ చిత్రంతో ఆమె ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘వైజయంతి మూవీస్’ ‘స్వప్న సినిమా’ బ్యానర్ల పై సి.అశ్వినీదత్,స్వప్న దత్, ప్రియాంక దత్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.2018వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 3 ఏళ్ళు కావస్తోంది.

మరి ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.80 cr
సీడెడ్ 2.72 cr
ఉత్తరాంధ్ర 4 cr
ఈస్ట్ 2.52 cr
వెస్ట్ 1.61 cr
గుంటూరు 2.15 cr
కృష్ణా 2.38 cr
నెల్లూరు 0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 28.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   18.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  46.10 cr

‘మహానటి’ చిత్రానికి రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.46.10 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లు రూ.25 కోట్ల లాభాలను ఆర్జించారన్న మాట. దాంతో ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus