మే 9న మహానటి విడుదల వెనుక బలమైన కారణం.!

“ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్
మహానటి సావిత్రి జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. రెండేళ్లుగా ఆమె గురించి పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేసుకొని మరీ ఈ సినిమాని రూపొందించారు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించింది. క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ గా సావిత్రి జీవితాన్ని మనకి చూపించనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ మే 9 నే విడుదల చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం శ్రీదేవి. ఆమె అకాల మరణం తర్వాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని శ్రీదేవికి అంకితమిచ్చినట్లు చెప్పారు. అంతేకాదు శ్రీదేవి, చిరంజీవి ప్రధాన పాత్రలలో రూపొందిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం మే 9న విడుదలై ఘన విజయం సాధించింది. అందుకే మే 9న మహానటిని కూడా విడుదల చేయాలని అశ్వినీదత్ ఫిక్స్ అయ్యారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా కోసం తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని సావిత్రి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus