ఏప్రిల్ 14న ‘మహానటి’ టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `మ‌హాన‌టి`. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక ద‌త్ నిర్మాత‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్ర బృందం రేపు (ఏప్రిల్ 14) “మహానటి” మోషన్ పోస్టర్ తోపాటు సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కుతున్న “మహానటి” సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర రాజం. దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న “మహానటి” చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus