కాంటెంట్ ఉండాలి గాని…హీరోతో సంభంధం లేకుండా హిట్స్ అందుకుంటున్నాయి చిన్న సినిమాలు…ఈ ఫొర్ములానే బేస్ చేసుకుని హిట్స్ మీద హిట్స్ కొడుకున్నాడు మన యువ హీరో శర్వానంద్…యాదృుచికమో…లేక కాకతాళీయమో తెలీదు కానీ… ఇద్దరు బడా హీరోల సినిమాల మధ్యలోనే వచ్చి, భారీ హిట్స్ ఇస్తున్నాడు మన యువ హీరో శర్వానంద్….విషయంలోకి వెళితే…శర్వానంద్ – మెహ్రీన్ జంటగా మారుతి డైరెక్షన్‌లో మహానుభావుడు సినిమా దసరా కానుకగా ఈ నెల 29న రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. శర్వానంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన శతమానం భవతి సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా మహానుభావుడు క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం మహానుభావుడు తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.8 కోట్ల షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లో మహానుభావుడు ప్రీమియర్లతోపాటు శుక్రవారం వరకు ఒక లక్ష 99వేల 281 డాలర్లు కలెక్ట్ అయ్యాయి. అంటే ఒక కోటి 31 లక్షల 10వేల రూపాయలు ఇండియన్ కరెన్సీలో కలెక్ట్ చేసింది. మరో వైపు స్పైడర్, జై లవకుశ లాంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నా ఈ దాదాపు 2 లక్షల డాలర్ల కలెక్షన్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక షాక్ ఏంటంటే శనివారం ఈ సినిమా ఓవర్సీస్‌లో స్పైడర్, జై లవకుశ సినిమాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శనివారం జై లవకుశ సినిమాకు 20వేల డాలర్లు, స్పైడర్‌కు ఒక లక్షా 4వేల డాలర్లు, మహానుభావుడు సినిమాకు ఒక లక్షా 62వేల డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. శనివారం ఒక్కరోజు కలెక్షన్ల పరంగా జై లవకుశ, స్పైడర్ కంటే మహానుభావుడు ముందున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకూ మంచి వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది…ఇక చెప్పాలి అంటే…ఇలానే కొనసాగితే….దసరా బ్లాక్ బష్టర్ రేస్ లో శర్వానంద్ పై చేయి సాధించినట్లే అని చెప్పక తప్పదు.అదీ మొత్తంగా మహానుబావుడి మ్యాటర్.