టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9న( మరో రెండు రోజుల్లో) భారీ స్థాయిలో విడుదల కానుంది. మహేష్ బాబు 25 వ చిత్రం కావడం.. అందులోనూ గత నాలుగు నెలల నుండీ పెద్ద చిత్రం ఒక్కటి కూడా లేకపోవడంతో ‘మహర్షి’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం బెంగుళూరు లో రికార్డు స్థాయిలో 400 కు పైగా స్క్రీన్లలో విడుదలకాబోతుంది. కర్ణాటకలో మహేష్ బాబు సినిమాలకి క్రేజ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
‘ఊపిరి’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రంలో మహేష్ ను మూడు విభిన్న కోణాల్లో చూపించాడు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కామెడీ హీరో అల్లరి నరేశ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు , పివిపి , అశ్వినీ దత్ వంటి బడా నిర్మాతలు కలిసి నిర్మించారు. మొదట్లో ఈ చిత్రం పై కాస్త నెగిటివిటీ ఉంది. అయితే ‘మహర్షి’ ట్రైలర్, ‘పదరా పదరా’ ‘ఇదే కదా’ పాటలు సినిమా పై ఉన్న ఆ నెగెటివిటీ ని కూడా తీసి పారేశాయి అనడంలో సందేహం లేదు.