‘అత్తారింటికి దారేది’ రికార్డును బ్రేక్ చేసిన మహేష్ బాబు?

  • May 21, 2019 / 06:02 PM IST

అదేంటి..? అత్తారింటికి దారేది రికార్డులు ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మహేష్ బాబు బ్రేక్ చేయడం ఏంటా అబూ అనుకుంటున్నారా? వరల్డ్ వైడ్ గా ‘అత్తారింటికి దారేది’ రికార్డులు ఎప్పుడో బ్రేక్కయ్యాయి. అయితే నైజాంలో మాత్రం ఇప్పటికి టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం. ఈ చిత్రం ఒక్క నైజాంలోనే 23.45 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘బాహుబలి’ రాకముందు వరకూ నెంబర్ 1 ప్లేస్ లో ‘అత్తారింటికి దారేది’ చిత్రమే ఉంది. అయితే ‘బాహుబలి’ తరువాత ఈ రికార్డుని ‘రంగస్థలం’ చిత్రం తో చరణ్ కూడా అధిగమించాడు.

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘మహర్షి’ చిత్రంతో ‘అత్తారింటికి దారేది’ రికార్డును బ్రేక్ చేసాడు. 12 రోజులకి గానూ ‘మహర్షి’ చిత్రం నైజాంలో 25.30 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రస్తుతానికి నైజాం లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది ‘మహర్షి’ చిత్రం. ఇదే రేంజ్లో కొనసాగితే.. రాంచరణ్ ‘రంగస్థలం’ రికార్డుని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. ‘రంగస్థలం’ చిత్రం నైజాంలో 27.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ కలెక్షన్లను కూడా అధిగమిస్తే ‘మహర్షి’ చిత్రం నైజాంలో నాన్- బాహుబలి’ గా నిలవడం ఖాయం. వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్ద కష్టమైంది కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus