నరేష్ కెరీర్లో ‘మహర్షి’ ఓ స్పెషల్ చిత్రం?

మహేష్ బాబు 25 వ చిత్రంగా రూపొందిన తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందింన ఈ చిత్రం మే 9న విడుదలకాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం. ఒక్క పాత మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. తాజాగా విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు మరింత బలపడ్డాయి. ఈ చిత్రంలో కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.మహేష్ కు స్నేహితుడు గా నటిస్తున్నాడు నరేష్.

ఇక ఈ చిత్ర కథాంశం ప్రకారం… వీరిద్దరూ కలిసి చదువు పూర్తి చేసిన తరువాత మహేష్ అమెరికా వెళ్ళిపోతాడని.. నరేష్ మాత్రం రైతుల సమస్యలపై పోరాతాడని ఈ క్రమంలో మహేష్ , నరేష్ కు సహాయం చేయడానికి ఇండియా వస్తాడనే కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ చిత్రంలో నరేష్ పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉంటుందని… తన నటన అందరినీ ఆకట్టుకుంటుందని కొందరి ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.నరేష్ కు ఈ చిత్రం నరేష్ కెరీర్లో ఓ స్పెషల్ చిత్రం అవుతుందట. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా… రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus