చాలా డల్ గా ఉన్నాయి మహేష్..!

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘మహర్షి’ చిత్రం తాజాగా విడుదలయ్యి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ 25 చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం వచ్చినప్పటికీ… ‘భరత్ అనే నేను’ రేంజ్లో కలెక్షన్లను రాబట్టలేకపోతుంది. మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ రెండో రోజు భారీగా డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 24.6 కోట్ల షేర్ ను రాబట్టగా రెండో రోజూ మాత్రం 8 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

ఇక రెండు రోజులకి గానూ ‘మహర్షి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 9.89 కోట్లు
సీడెడ్ – 3.50 కోట్లు


వైజాగ్ – 3.93 కోట్లు
ఈస్ట్ – 3.80 కోట్లు
వెస్ట్ – 2.90 కోట్లు


కృష్ణా – 2.35 కోట్లు
గుంటూరు – 4.89 కోట్లు
నెల్లూరు – 1.34 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 32.6 కోట్లు(టోటల్)
———————————————

‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు రోజులకి గానూ తెలుగు రాష్ట్రాల్లో 32.6 కోట్ల షేర్ వచ్చింది. రెండో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక శని,ఆది వారాల సంగతి ఓకే ! కానీ సోమవారం నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది. మహేష్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఓవర్సీస్లో ఈ చిత్రం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. 1 మిలియన్ దాటడానికే అష్టకష్టాలు పడుతుంది. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. సమ్మర్ హాలిడేస్ ఉన్నా.. దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినా… ఓపెనింగ్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus