‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయి కానీ.. ఊహించినంత లేవు

మహేష్ బాబు హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘మహర్షి’. ఇది మహేష్ కు 25 వ చిత్రం. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం మే 9 న (నిన్న) విడుదలయ్యి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘భరత్ అనే నేను’ రేంజ్లో బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా పర్వాలేదు అనే టాక్ అయితే వచ్చింది. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ లాంటి బడా ప్రొడ్యూసర్లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినా నాన్ బాహుబలి రికార్డులని అయితే ఈ చిత్రం ‘డే1’ రికార్డ్స్ ను కొట్టలేకపోయింది. టికెట్ రేట్లు పెంచారు… పక్కన మరే పెద్ద సినిమా లేదు అయినా ఈ చిత్రం ఇప్పటివరకూ ‘నాన్ బాహుబలి’ పేరుతో ఉన్న ‘అజ్ఞాతవాసి’ నే కాదు కనీసం ‘అరవింద సమేత’ ‘వినయ విధేయ రామా’ కల్లెక్షన్లని కూడా దాటలేకపోయింది.

అయితే మహేష్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ‘డే 1’ రికార్డు కలెక్షన్స్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుకుగానూ ‘మహర్షి’ చిత్రం 24.18 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 6.38 కోట్లు
సీడెడ్ – 2.89 కోట్లు
వైజాగ్ – 2.88 కోట్లు


ఈస్ట్ – 3.20 కోట్లు
వెస్ట్ – 2.47 కోట్లు
కృష్ణా – 1.39 కోట్లు


గుంటూరు – 4.4 కోట్లు
నెల్లూరు – 1.1 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 24.6 కోట్లు
(టోటల్)
———————————————

మంచి టాక్ వచ్చినప్పటికీ చరణ్ డిజాస్టర్ సినిమా ‘వినయ విధేయ రామా’ రికార్డును కొట్టలేకపోయాడు మహేష్. ఇక ‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24.6 కోట్ల షేర్ వచ్చింది. మొదటి రోజు 30 కోట్లు అనుకున్నారు. కానీ ఈ చిత్రం ఆ రేంజ్ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మహేష్ కు ఓవర్ సీస్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉన్నా… అక్కడ కూడా ఈ చిత్రం ‘బ్రహ్మోత్సవం’ ను కూడా క్రాస్ చేయలేకపోయింది. ‘మహర్షి’ చిత్రం అక్కడ ప్లాప్ గా మిగిలింది. ఇక అక్కడ భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 72 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. మరి ఫస్ట్ వీకేన్డ్ ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus