దుబాయ్ రివ్యూ ప్రకారం సినిమా సూపర్ హిట్టే!

మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన “మహర్షి” ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు ప్రముఖ నిర్మాతలైన అశ్వినీదత్-దిల్ రాజు-పి.వి.పిలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఓవర్సీస్ షోస్ ప్రకారం మొదటి షో మన ఇండియన్ టైమ్ 12.15 గంటలకు మొదలవుతుంది. ఇండియాలో ఆంధ్రాలోని ఒంగోల్ లో 4.00 గంటలకు మొట్టమొదటి షోలు పడనున్నాయి. అయితే.. ఈలోపే దుబాయ్ లో మన తెలుగు సినిమాలకు సెన్సార్ రివ్యూ రాసే ఉమైర్ సంధు అనే వ్యక్తి “మహర్షి” చిత్రాన్ని ఓవర్సీస్ సెన్సార్ స్క్రీనింగ్ లో భాగంగా చూసి ఒక మినీ రివ్యూ ఇచ్చాడు. అదేంటో చూద్దాం..!!

మహేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్:

ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రిషి అనే పాత్రలో అద్భుతంగా నటించాడని, మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమాలో పోషించిన స్టూడెంట్ రోల్ మరియు రైతు పాత్రలో ఒదిగిపోయాడని. క్లైమాక్స్ ఎపిసోడ్ లో రైతుగా మహేష్ బాబు ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించడమే కాక ఆలోచింపజేస్తుందని టాక్.

వంశీ పైడిపల్లి దర్శకత్వ ప్రతిభ:

నిన్నమొన్నటివరకూ సినిమాని చాలా లేట్ గా తీశాడని ఫ్యాన్స్ అందరూ గట్టిగా తిట్టుకున్న వంశీ పైడిపల్లి మీద మహేష్ అభిమానుల ఒపీనియన్ పూర్తిగా మారిపోతుందని, తమ హీరోను ఇంత అద్భుతంగా తెరపై ప్రెజంట్ చేసినందుకు వాళ్ళు ఎప్పటికీ వంశీకి ఋణపడి ఉంటారని చెబుతున్నారు. అలాగే.. సినిమాలో కాలేజ్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ భలే నవ్విస్తుందని చెబుతున్నారు.

పూజా హెగ్డే అందం-అభినయం:

సినిమాలో పూజా హెగ్డే కనిపించేది కాసేపే అయినప్పటికీ.. ఆమె నటన, అందం సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని, ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఆమెను ఒక గ్లామ్ డాల్ గా చూసిన వాళ్ళందరూ మంచి నటిగా గుర్తిస్తారని వినికిడి.

అల్లరి నరేష్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్:

సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం కథలో కీలకమైన మార్పుకి కారణమే అల్లరి నరేష్ పోషిస్తున్న స్నేహితుడి పాత్ర. ఓ రెండు సన్నివేశాల్లో అల్లరి నరేష్ ఏడిపించేస్తాడని కూడా చెబుతున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం:

పాటలు విని పెద్దగా బాలేవంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా గట్టిగా హర్ట్ అయ్యారు. అయితే.. ఆ డిస్సాటిసిఫేక్షన్ మొత్తం సినిమా చూశాక పోతుందని, నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని దేవిశ్రీప్రసాద్ ను తెగ పొగిడేశారు.

రైతుగా మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్:

రైతు సమస్యలపై పోరాడే సన్నివేశాల్లో మహేష్ బాబు పలుగు, నాగలి పట్టుకొని నడవడం వంటి సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయని. మహేష్ అలా నాగలి పట్టుకోవడం తెరపై ఇదే మొదటిసారి కాబట్టి చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయని చెప్పుకొంటున్నారు.

ఫైనల్ గా..

“మహర్షి” సినిమా సంఖ్య పరంగానే కాదు రిజల్ట్ పరంగానూ మహేష్ బాబుకు మరియు ఆయన అభిమానులకు ప్రత్యేకంగా మిగిలిపోతుందని దుబాయ్ రివ్యూ వల్ల తెలిసింది. మరి ఫైనల్ రిజల్ట్ కోసం రేపు “ఫిల్మీఫోకస్” ఇచ్చే ఎక్స్ క్లూజివ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus