మహేష్ కోసం కదిలొస్తున్న పవన్!

మహేష్ బాబు 25 వ చిత్రమైన ‘మహర్షి’ తాజాగా విడుదలయ్యి డీసెంట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను సాధిస్తుంది. మొదట ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం కాన్సెప్ట్ జనాల్ని థియేటర్లకు రప్పిస్తుంది. అంతేకాదు రోజు రోజుకి ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతుంది. ఓ మైల్ స్టోన్ చిత్రానికి మహేష్ ఎంచుకున్న కాన్సెప్ట్ కు ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దర్శకుడు వంశీ పైడిపల్లికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రాన్ని చూడబోతున్నారని తెలుస్తుంది.

రైతు సమస్యలను చాలా ఎమోషనల్ గా హృదయాలను హత్తుకునే విధంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చూడడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యుల దగ్గరకు రావడంతో ఆయన కోసం స్పెషల్ షోకి ఏర్పాటు చేస్తున్నారట. ప్రసాద్ ఐమాక్స్ లేదా మహేష్ మల్టీప్లెక్స్ అయిన ‘ఏ.ఎం.బి సినిమాస్’ లో పవన్ కోసం స్పెషల్ షో వేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ కి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తన ఫాంహౌస్ కి వెళ్ళి అక్కడ వ్యవసాయం కూడా చేస్తుంటారు పవన్. పవన్ 25 వ చిత్రమైన ‘అజ్ఞాతవాసి’ లో కూడా వ్యవసాయం చేస్తూ కనిపిస్తుంటాడు పవన్. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ కు రైతులంటే ఎంత గౌరవమో. ఇక పవన్ కూడా ‘మహర్షి’ చిత్రం చూడడానికి సిద్దమవుతుండడంతో అటు పవన్, ఇటు మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus