భారీ షెడ్యూల్ కి సిద్ధమైన మహర్షి టీమ్

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందుకే తన సినీ కెరీర్ లో 25 వ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోవాలని మహర్షి అనే సినిమాకి మహేష్ బాబు ఒకే చెప్పారు. భరత్ అనే నేను వంటి హిట్ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీలో క్లాస్, మాస్ అమాశాలు రెండింటిని మేళవించారు. రైతుల కష్టాలపై సాగే ఈ చిత్రం స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు డెహ్రా డూన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన వంశీ నెక్స్ట్ షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేశారు.

అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వెగాస్‌లో షూటింగ్ చేయనున్నారు. అక్కడ రెండు నెలల పాటు సాగే ఈ షెడ్యూల్‌ సెప్టెంబర్ 2వ వారం మొదలవబోతోంది. మేజర్ పార్ట్ ని అక్కడ కంప్లీట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ ల్లోనే పూజా హెగ్డే, మహేష్ బాబు లపై రెండు రొమాంటిక్ సాంగ్స్ కూడా కంప్లీట్ చేయనున్నట్టు తెలిసింది. మహేష్ తల్లిదండ్రులుగా జయసుధ, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్న ఈ మూవీలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించే పనిలో ఉన్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus