నిజ జీవితంలో యువత తీరును సున్నితంగా విమర్శిస్తూ హాస్యాన్ని పండించే “మహాతల్లి” ఈ సారి పార్లర్ వారిపై తనదైన శైలిలో పంచ్ వేసింది. తాగాక ముందు తాగిన తర్వాత, అనుకున్నదొకటి.. అయింది ఒకటి, సంచార వాణి, ఆడ వారి మాటలకు అర్దాలు వేరులే.. వంటి క్యూట్ చిత్రాలను అందించిన వైరల్లీ సౌత్ నుంచి వచ్చిన మరో హాస్య గుళిక ఈ అలంకరణ శాల.
టాపిక్ ఏమిటంటే ..
పని ఒత్తిడిలో అలసిపోయిన అమ్మాయిలు కాస్త రిలాక్స్ అవుదామని పార్లర్ కి వెళుతారు. ఇంట్లో కంటే ప్రొఫెషనల్స్ తమని అందంగా చేస్తారని భావిస్తారు. కాని అక్కడకు పోతే తెలుస్తుంది. సెలూన్ వాళ్లు కూడా మాటలు నేర్చుకున్నారని… మనకి నచ్చినట్లు కాకుండా వారికి తెలిసిన విద్యతో మనపై ప్రయోగాలు చేస్తారని… ప్రొడక్ట్ అమ్మే వారిలాగా వారి దగ్గర ఉన్న ప్యాకేజీలను అంటగట్టేస్తారని. మొహమాటానికి పోయి అమ్మాయిలు తమ బ్యాగ్ లో మనీ ఖాళీ చేసుకుని ఇంటికి వస్తారు. ఇది నేటి కాలలంలో ప్రతి ఒక అమ్మాయి ఎదుర్కొనే అనుభవం. ఈ రియల్ సీన్లను మహాతల్లి రీల్ పైకి ఎక్కించింది.
పార్లర్ లో కామన్ గా ఫేస్ చేసే సమస్యలను చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం బాగుంది. ఈ ఫిలింలో జాహ్నవి మొహమాట పడే కస్టమర్ గా, మాటల్లో దించే పార్లర్ గర్ల్ గా రెండు పాత్రల్లో సహజంగా నటించారు. ఒకరే ఫిలిం మొత్తం ఉండడం వల్ల ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ప్లాన్ గా వ్యవహరించి టీం విజయవంతమైంది. అలంకరణ శాల షార్ట్ ఫిలిం నేటి అమ్మాయిలకు తప్పకుండా నచ్చుతుంది అనడంలో సందేహం లేదు.