గత వారం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ పక్కన సైలెంట్ గా వచ్చిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. జూలై 25న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు అశ్విన్ కుమార్ యానిమేటెడ్ వెర్షన్ గా మహావిష్ణువు 9 అవతారాలను సినిమాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మొదటి చిత్రంగా ‘మహావతార్ నరసింహ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది అందరికీ తెలిసిన కథే.. కానీ నెక్స్ట్ జెనరేషన్ కి హిరణ్యకశిపుడు,మహావిష్ణువు,ప్రహ్లాదుడు వంటి వారి గురించి క్లుప్తంగా వివరిస్తూ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘హోంబలే ఫిలింస్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గీతా డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రిలీజ్ చేసింది. తక్కువ థియేటర్లు, తక్కువ టికెట్ రేట్లు పెట్టడం.. పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ పెరగడం జరిగింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
ఏపీ+తెలంగాణ | 7.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ | 20.5 cr |
ఓవర్సీస్ | 1.8 cr |
వరల్డ్ టోటల్ | 29.42 cr (షేర్) |
‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి వారానికే ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.29.42 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.14.42 కోట్ల లాభాలు అంటే.. ఆల్రెడీ డబుల్ ప్రాఫిట్స్ అనమాట. హిందీలోనే రూ.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 2వ వీకెండ్ కు పబ్లిక్ డిమాండ్ వల్ల మరింతగా స్క్రీన్స్ పెంచుతున్నారు. రెండో వీకెండ్ ను కూడా ఈ సినిమా మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.