Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

‘మహావతార్ నరసింహ’ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా ఉండటంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. అయినప్పటికీ లిమిటెడ్ స్క్రీన్స్, తక్కువ టికెట్ రేట్లతో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. 2వ వీకెండ్ ‘కింగ్డమ్’ సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. 2వ వారంలో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

Mahavatar Narsimha Collections

3వ వీకెండ్ లో కూడా దుమ్ము లేపుతుంది. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావిష్ణువు 9 అవతారాలను యానిమేటెడ్ వెర్షన్లుగా..  9 సినిమాలుగా తీస్తానని గతంలో వెల్లడించారు. అందులో మొదటి భాగంగా ‘మహావతార్ నరసింహ’ వచ్చింది. ఆల్రెడీ రూ.160 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసిన ‘మహావతార్ నరసింహ’ 3వ వీకెండ్లో కూడా కుమ్మేసేలా ఉంది. ఒకసారి 16   కలెక్షన్స్ ని గమనిస్తే :

ఏపీ+తెలంగాణ 16.85 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+హిందీ 80.8 cr
ఓవర్సీస్ 4.58 cr
వరల్డ్ టోటల్ 102.23 cr (షేర్)

‘మహావతార్ నరసింహ’ ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 16 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.102.23 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.87.23 కోట్ల లాభాలతో అంటే.. ఆల్మోస్ట్ 6 రెట్లు పైగా లాభాలు అందించింది అని చెప్పాలి. 16వ రోజు ఏకంగా రూ.25 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus