వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ ని లాక్ చేసిన ప్రిన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ప్లాన్ తో దూసుకు పోతున్నారు. మురుగ దాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న ప్రిన్స్, దీని తర్వాత కొరటాల శివతో కలిసి మళ్లీ పనిచేయనున్నారు. జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా నటించనున్నారు. అసలు మహేష్ 24 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేయాల్సింది. నిర్మాణ సంస్థ పీవీపీ వారు చేసిన అత్యుత్సాహం వల్ల ఆ అవకాశం కొరటాలకు వెళ్లింది. అప్పుడు వంశీ తో మూవీ క్యాన్సల్ అయిందని కూడా వార్త ప్రచారం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం ఆ మూవీ ఆగిపోలేదు. రీసెంట్ గా స్క్రిప్ట్ మొత్తాన్ని పూర్తి చేసిన వంశీ, మహేష్ కి వినిపించడం, ఆయనకు నచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడం జరిగిపోయాయట. కొరటాల మూవీ షెడ్యూల్ గ్యాప్ లో వంశీ మూవీ ని కూడా పట్టాలెక్కించాలని ప్రిన్స్ భావిస్తారని తెలిసింది. మహేష్ 23 వ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అవుతుంది. కొరటాల కాంబినేషన్లో సినిమా 2017 దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేయనున్న 25 చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విడుదలై రెండు నెలలు అవుతున్నా డైరక్టర్ ని ఎంపిక చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, మహేష్ మాత్రం మూడు చిత్రాలను ఒకే చేసి తన దూకుడు ని ప్రదర్శిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus