మహేష్, వంశీ మూవీ తొలి షెడ్యూల్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనుంది. మహేష్ బాబు కి మిత్రుడిగా అల్లరి నరేష్, అతని గర్ల్ ఫ్రెండ్ గా “అర్జున్‌రెడ్డి” భామ షాలిని పాండే కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ కెమెరామెన్ గా పనిచేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా జరిగిన ఈ చిత్రం తొలి షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల పదవతేదీన డెహ్రాడూన్ లో షూటింగ్ మొదలుకానుంది.

అక్కడ కాలేజీలో మహేష్, అల్లరి నరేష్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ అయిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం అమెరికాకి వెళ్లనుంది. అక్కడ అందమైన ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ భారీ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు సాగనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఊపిరి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వంశీ చేస్తున్న ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus