ఖరారు అయిన మహేష్, వంశీ పైడిపల్లి సినిమా విడుదల తేదీ

విజయం కేవలం ఉత్సాహాన్ని మాత్రమే కాదు.. ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. రెండు అపజయాల తర్వాత విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఆ నమ్మకంతోనే ప్రయోగానికి సై అన్నారు. కొత్త లుక్ తో తన 25 వ మూవీ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరుగుతోంది. యోగా డే సందర్భంగా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రీకరణ బ్రేక్ లోనే అల్లరి నరేష్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేశారు. ఇందులో అతను మహేష్ మిత్రుడిగా కనిపించబోతున్నారు. దిల్ రాజు, అశ్విన్ దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.

అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తుందనుకున్నారు. కానీ రామ్ చరణ్ చిత్రం అప్పుడే రిలీజ్ కానుండడంతో అనవసరమైన పోటీ ఎందుకని వాయిదా వేసుకున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 5 న థియేటర్లో తీసుకురావాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ మహేష్ బాబు కి మంచి విజయాలను ఇచ్చిన నెల. మహేష్ బాబుని స్టార్ హీరోగా నిలబెట్టిన ‘పోకిరి’, ఇటీవల ఆయన సాధించిన సూపర్ హిట్ ‘భరత్ అనే నేను’ రెండూ ఏప్రిల్ నెలలోనే విడులయ్యాయి. అందుకే ఆ నెలలోనే విడుదల చేస్తే బాగుంటుందని మహేష్, దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అంటే మరో హిట్ మహేష్ ఖాతాలో పడబోతుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus