వర్షం వల్ల ఆగిపోయిన మహేష్ 25 సినిమా షూటింగ్

Advertisement

భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఈ మూవీ షూటింగ్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరుగుతోంది. యోగా డే సందర్భంగా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినప్పటికీ నిన్నటి నుంచి షూటింగ్ మొదలయింది. అయితే మళ్ళీ బ్రేక్ పడింది. ఈ సారి కారణం ప్రముఖులు కాదు.. ప్రకృతి. షూటింగ్ మొదలవ్వగానే వర్షం కూడా మొదలవడంతో షూటింగ్ కి పేకప్ చెప్పడం తప్పలేదు. దిల్ రాజు, అశ్విన్ దత్ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.

ఇక మహేష్ బాబు కి అల్లరి నరేష్ ప్రాణస్నేహితుడిగా కనిపించబోతున్నారు. మహేష్ కోటీశ్వరుడిగా, నరేష్ పేదవాడిగా నటించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది. ఊపిరి తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ మహేష్ కోసం వంశీ పైడిపల్లి రెండేళ్లుగా ఎదురుచూసారు. ఈసారి కూడా తన సినిమాలో ఇద్దరు హీరోలను పెట్టుకొని హిట్ అందుకోవాలని చూస్తున్నారు. డెహ్రాడూన్ షెడ్యూల్ అనంతరం టీమ్ మొత్తం అమెరికాకి వెళ్లనుంది. అక్కడే ఎక్కువభాగం షూటింగ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus