మహేష్… సుకుమార్ కు డేట్స్ ఇచ్చేసాడు..!

టాలీవుడ్ సూపర్ స్టేర్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 25 వ చిత్రమైన ‘మహర్షి’ తో బిజీగా ఉన్నాడు. ఇది మహేష్ బాబుకి 25 వ చిత్రం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ‘వైజయంతి మూవీస్’ ‘పీవీపీ సినిమా’ బ్యానర్లు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘మహేష్ 26’ సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నాడు మహేష్. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ చిత్రాన్ని . మే నెల నుండీ సెట్స్ పైకి తీసుకువెళుతున్నట్టుగా సమాచారం.అయితే మొదట ఏప్రిల్ నెలలో సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని భావించినప్పటికీ ‘మహర్షి’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంటారనే ఉద్దేశంతో మే నెలకి మార్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందు రకుల్ ను తీసుకోవాలని భావించినప్పటికీ… తరువాత మరో హీరోయిన్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉందట. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోవడానికి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మే నెల నుండీ ఈ చిత్ర షూటింగ్ మొదలవుతున్నప్పటికీ… మహేష్ మాత్రం జూన్ నుండీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడానికి డేట్స్ ఇచ్చాడని సమాచారం. మొదటి షెడ్యూల్ ను ఫారిన్లో చిత్రీకరించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus