‘మహేష్ 27’ స్టోరీ లైన్ అదే..!

మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రమోషన్స్ తర్వాత మహేష్ తన కుటుంబంతో విదేశాలకు బయల్దేరాడు. ఒక మూడు నెలలు తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తిరిగి ఇండియా వస్తాడట. వచ్చిన వెంటనే తన 27 వ చిత్రం షూటింగ్ ను మొదలు పెడతాడని సమాచారం. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

దిల్ రాజు నిర్మాణంలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతుంది. ఇదే కాంబినేషన్లో గతేడాది ‘మహర్షి’ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ లో మహేష్ ను చూపించి ఫ్యాన్స్ ను అలరించిన దర్శకుడు వంశీ పైడిపల్లి… ‘మహేష్ 27’ లో మాత్రం వైజాగ్ పోర్ట్ ను శాసించే పవర్ ఫుల్ డాన్ గా చూపించబోతున్నాడట. కథ మొత్తం వైజాగ్ నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, నిధి అగర్వాల్ వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తారని సమాచారం.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus