Mahesh Babu: సంక్రాంతికి గట్టిగా కొడతాం.. నాన్నగారు లేకపోవడమే లోటు: మహేష్ బాబు

  • January 10, 2024 / 10:50 AM IST

జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గుంటూరులో ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు అందరూ త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలా అని.. డిస్కస్ చేసుకుంటున్న టైంలో ఆయన ‘మీ ఊరిలో చేద్దాం సార్’ అన్నారు.

దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేయండని అన్నాను. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది.ఇది నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడు కంటే ఎక్కువ. మా ఫ్యామిలీ మెంబెర్లా భావిస్తూ ఉంటాను. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం. కానీ ఈ గత 2 సంవత్సరాలుగా ఆయన నాకిచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. థాంక్యూ సార్. మీకు థాంక్స్ చెప్పుకోవడం కూడా నాకు వింతగానే ఉంది.

ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోము. ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. అతడు నుంచి మా ప్రయాణం మొదలైంది. ఖలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేనెప్పుడూ ఇలా చెప్పలేదు. ఇవి నా హార్ట్ లో నుండి వచ్చే మాటలు.ఇవి అభిమానుల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. లవ్ యు సార్. మా నిర్మాత చినబాబు గారు.. ఇది నాకు ఆయన చెప్పలేదు కానీ నాకు తెలుసు.

ఆయన బాగా ఇష్టపడే హీరోని నేనే. మానిటర్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్ లో సీన్స్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందమేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. థాంక్యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు, డైరెక్టర్ గారికి తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారు అనేది. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీలీల గురించి చెప్పాలంటే.. చాలా రోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది.

హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఆమె షాట్ లేనప్పుడు కూడా స్పాట్లోనే ఉంటుంది. మేకప్ వ్యాన్లోకి వెళ్ళదు. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం.. వామ్మో(నవ్వుతూ).. అదేం డ్యాన్స్. హీరోలు అందరికీ తాట ఊడిపోద్ది. శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్ ఉంది. మీనాక్షి మా సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. నేను, త్రివిక్రమ్ గారు అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే మా సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అందుకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. అంటే నాకు చాలా ఇష్టం. నాకు బ్రదర్ లాగా.! అతను ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు.

ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని (Mahesh Babu) నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. తమన్ అలా చేయలేదు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి. థాంక్యూ తమన్. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి ఏడాది అది పెరుగుతూనే ఉంది. మీకు చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప ఏం చేయాలో నాకు తెలీదు. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. నాకు, నాన్నగారికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే.

ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు.. అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెప్తుంటే ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఈ సినిమాలు, ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. ఈ ఫంక్షన్ జరగడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus