రాజమౌళి కంటే ముందు ఆ ఇద్దరితో..!

చాలా కాలంగా మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ వార్తల్లో నలుగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తవుతుండడం, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో.. ఇక జక్కన తదుపరి సినిమా మహేష్ బాబుతోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మహేష్ బాబు ఆలోచన మరోలా ఉందని సమాచారం. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నాడు.

అయితే ‘ఎఫ్ 3’ రిజల్ట్ మీద ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుంది. అనీల్ రావిపూడి సినిమా ఓకే చేసి పూర్తి చేసినా.. దాని వెంటనే రాజమౌళి సినిమా ఉండదట. అనీల్ రావిపూడి సినిమా తరువాత మరో సినిమా చేయాలని మహేష్ అనుకుంటున్నాడని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఛాయిస్ అని తెలుస్తోంది. అటు త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ కాకపోతే.. పూరి జగన్నాధ్ తో అయినా ఓ సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అలా రెండు సినిమాలు చేసిన తరువాతే రాజమౌళితో సినిమాకి రెడీ అవుతాడట మహేష్. ఒక్కసారి రాజమౌళి ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయితే మూడేళ్ల వరకు మరో సినిమా చేసే ఛాన్స్ ఉండదని.. కాబట్టి ముందే రెండు సినిమాలు చేసి ఆ తరువాత రాజమౌళితో సినిమా చేద్దామని మహేష్ ఆలోచిస్తున్నాడట. మరి దీనిపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతారో!

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus