SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి రాజమౌళి ఓ స్టార్ హీరోతో పనిచేస్తున్నారు అని చెప్పాలి. అంటే ఇప్పటివరకు రాజమౌళితో చేసిన రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వాళ్ళు స్టార్లు కాదా? అనే డౌట్ మీకు రావచ్చు. వాస్తవానికి వీళ్లంతా రాజమౌళితో సినిమాలు చేశాక స్టార్స్ గా ఎదిగారు. కానీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి వాళ్ళు రాజమౌళి సపోర్ట్ లేకుండా స్టార్స్ గా ఎదిగిన హీరోలు. ఈ లీగ్లో రాజమౌళి ముందుగా మహేష్ బాబుతో పనిచేస్తున్నారు.

SSMB29

అందువల్ల ఈ ‘SSMB29’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అలాగే మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ రకంగా కూడా ఈ ప్రాజెక్టు చాలా స్పెషల్ గా ఉండబోతుంది. అయితే అంత స్పెషల్ మూవీకి టైటిల్ కూడా అంతే స్పెషల్ గా, ముఖ్యంగా మహేష్ బాబు ఇమేజ్ కి సరిపడేలా పవర్ఫుల్ గా, అలాగే పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా క్యాచీగా ఉండేలా చూసుకుంటారు అని అంతా ఆశిస్తారు. కానీ ఈ సినిమాకి ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ నడుస్తుంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో.. వారణాసి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. ఓ కీలక షెడ్యూల్ ను ఇందులో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. రాజమౌళి- మహేష్ బాబు సినిమా అంటే టైటిల్.. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంతా భావిస్తారు. కానీ ‘వారణాసి’ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి? అనే చర్చలు ఇప్పుడు సర్వత్రా నడుస్తున్నాయి. అయితే ఈ సస్పెన్స్ కి ఓ క్లారిటీ రావాలంటే మనం నవంబర్ వరకు వేచి చూడాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆ టైంకే రానుంది.

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus