ఉదయ్ కిరణ్ గతంలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన స్టార్ హీరో. అతని సినిమా వస్తుందంటే సీనియర్ స్టార్ హీరోలు కూడా తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి. అలాంటిది తర్వాత అతని కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. అతను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు విడుదల కావడానికి చాలా టైం పట్టాయి. ఇక కొన్ని పెద్ద బ్యానర్లలో ఉదయ్ కిరణ్ సైన్ చేసిన ప్రాజెక్టులు.. ఆగిపోయాయి. వీటికి కారణం ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద ఫ్యామిలీ అని చాలా మంది చెప్పే మాట.
అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఉదయ్ కిరణ్.. కెరీర్, సూసైడ్ మ్యాటర్ గురించి డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఉదయ్ కిరణ్ చనిపోయిన టైంలో సీనియర్ స్టార్ రైటర్, నటుడు అయిన పరుచూరి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..”ఉదయ్ కిరణ్ ఇలా చేస్తాడనుకోలేదు. చాలా బాధగా ఉంది. అతనితో నేను 4 సినిమాలకు పనిచేశాను.ఆ 4 సినిమాలకు రైటర్ గానే కాకుండా.. వాటిలో అతనితో కలిసి నటించడం కూడా జరిగింది.
ఎవరికైనా ఎత్తు పల్లాలు ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. అతని పరిస్థితి చూసి.. నేను,దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఓ కథ రాసుకుని ఓ నిర్మాతని సెట్ చేశాం. అది సెట్స్ పైకి వెళ్లే టైం ప్రొడ్యూసర్ వాకౌట్ అయిపోయాడు. మేమైతే అతనికి హెల్ప్ చేయలేకపోయాము” అంటూ చెప్పుకొచ్చారు. అయితే పరిచురి వెంకటేశ్వరరావు కామెంట్స్ ను బట్టి.. ఆ నిర్మాతని ఇండస్ట్రీలో కొంతమంది కావాలనే బెదిరించి వాకౌట్ అయ్యేలా చేశారని.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈ రకంగా పాత వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడమే కాదు.. మళ్ళీ హాట్ టాపిక్ అయ్యిందని కూడా చెప్పాలి.