Mahesh Babu, Trivikram: మహేష్ వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కానున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ బాగానే అంచనాలు పెట్టుకున్నారు. బుల్లితెరపై అతడు, ఖలేజా ఇప్పటికీ మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకక్కనుంది.

ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుందని అయితే ఎంటర్టైన్మెంట్ కు లోటు లేకుండా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 2022 సంవత్సరం సమ్మర్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. సినిమాసినిమాకు భిన్నమైన కథను ఎంచుకుంటున్న త్రివిక్రమ్ మహేష్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తాడని మహేష్ బాబు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. విలన్లపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో త్రివిక్రమ్ మూవీలో మహేష్ కనిపించనున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus