వంశీ పైడిపల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్

Advertisement

మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ ప్రతి దర్శకుడిని గురువులా గౌరవిస్తారు. వారి మాటని నమ్ముతారు. పాటిస్తారు. అందుకే అతన్ని అందరూ దర్శకుల హీరో అని పిలుస్తుంటారు. డైరక్టర్లు మాత్రం మహేష్ ని స్నేహితుల్లా భావిస్తారు. చాలా సరదాగా ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటో. ఈ రోజు (శుక్రవారం) వంశీ పైడిపల్లి పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మహేశ్‌బాబు శుభాకాంక్షలు చెప్పారు. “40 ఏళ్ల యంగ్‌ దర్శకుడు, నా స్నేహితుడు వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అనుమానం లేదు.. 40 ఏళ్లంటే 20 ఏళ్లే. యంగ్‌గా, ఆనందంగా జీవించండి” అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు వంశీ దర్శకత్వంలో వస్తోన్న తన 25వ సినిమా సెట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.

మహేష్ తో పాటు హరీష్‌ శంకర్‌ శుభాకాంక్షలు చెప్పారు. “బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుడు, నా స్నేహితుడు, శ్రేయోభిలాషి వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు గొప్పగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా మిత్రమా” అని ట్వీట్‌ చేశారు. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న మహేశ్‌ 25వ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ మిత్రుడిగా కనిపించబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు. అప్పుడే టైటిల్ కూడా రివీల్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus