Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

‘వారణాసి’ సినిమా గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం వీడియోలతోపాటు మరో వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే మహేష్‌బాబు కారుకు పడ్డ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన వీడియో. గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌కి మహేష్‌బాబు తన కుటుంబంతో కలసి ఓ కారులో వచ్చాడు. అంతకుమందే మహేష్‌ కారు నెంబర్‌ పట్టేసిన ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో కారు, కారు నెంబరు చూసి మురిసిపోగా.. ఓ అభిమాని మాత్రం ఆ కారుకు ఎన్ని ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నాయి అనేది చూశాడు.

Mahesh Babu car challans

చూడటమే కాదు, ఆ చలాన్ల పేమెంట్‌ను కూడా కట్టేసి మహేష్‌ మీద తన అభిమానాన్ని చూపించాడు. దీనికి సంబంధించి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. TS36 N 4005 అనే కారు నెంబరుతో చెక్‌ చేస్తే అందులో పేరు ఘట్టమనేని మహేష్‌ బాబు అని చూపిస్తోంది. దానికి ఇటీవల కాలంలో రెండు చలాన్లు ఉన్నాయి. ఆ రెండూ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై హై స్పీడ్‌తో వెళ్లడంతోనే ఫైన్లు పడ్డాయి. వాటినే ఇప్పుడు అభిమాని చెల్లించేశాడు.

ఇదంతా చూస్తున్న నెటిజన్లు ఆ అభిమాని ఎవరో గ్రేట్‌ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. మరోవైపు ఇలాంటి ఫ్యాన్‌ ఉన్న మహేష్‌బాబు కూడా అదృష్టవంతుడు అంటూ పొగిడేస్తున్నారు. ఇక్కడ అభిమాని చెల్లించింది రెండు చలాన్లు. వాటి మొత్తం సుమారు 2070 రూపాయలు. అయితే ఈ రెండు చలాన్లు ఓవర్‌ స్పీడ్‌ కారణంగా ఆ కారుపై పడ్డాయి. అంటే పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పరిమితికి మించి వేగంతో ఆ కారు వెళ్లింది. ఈ లెక్కన ఆ కారు నడిపే వ్యక్తి తప్పు చేసినట్లే.

ఆ ఫైన్లు పడినప్పుడు కారులో ఎవరు ప్రయాణిస్తున్నారు, ఎవరు డ్రైవ్‌ చేస్తున్నారు అనేది తెలియదు కానీ.. ఇలాంటి తప్పులు చేయడం మహేష్‌ బాబు లాంటి స్టార్‌ హీరో కారు నడిపే వ్యక్తికి సరికాదు. మరి ఈ చలాన్ల విషయంలో మహేష్‌ ఏమన్నా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus