ఇప్పటికే ఓసారిసారి వాయిదా పడినా.. ఇంకా అంచనాలు అలానే నిలుపుకున్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రామ్ క్రేజ్ కారణమో, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ కారణమో, ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ నడుస్తోంది అని కామెంట్లు కారణమో కానీ ఆ సినిమా అయితే ఇంకా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అలాంటి సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంటోంది అని సమాచారం. అయితే ఈసారి అభిమానులు ఆందోళన చెందక్కర్లేదు.. కాస్త సంతోషపడొచ్చు అని చెబుతున్నారు.
ఎందుకంటే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా డేట్‌ను మార్చి ఈసారి కాస్త ముందుకు తీసుకొస్తున్నారు. నవంబరు 28న విడుదల కావాల్సిన సినిమాను ఒక రోజు ముందుకు జరిపి 27నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి థియేటర్లు సిద్ధమైతే ఒక రోజు ముందే సాగర్ ప్రేమకథను చూసేయొచ్చు. అలాగే ఆ ఆంధ్రా కింగ్ సంగతేంటి, ఆ ఫ్యాన్ ప్రేమకథేంటి అనేది కూడా తెలుసుకోవచ్చు.
నవంబరులో సాధారణంగా పెద్ద చిత్రాల సందడి ఉండదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీసుకొస్తూ ఉంటారు. అలా తొలి రెండు వారాల్లో రష్మిక మందన ‘ది గర్ల్ ఫ్రెండ్’, దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ భోర్సే ‘కాంత’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలు వచ్చాయి. ఇక వచ్చే వారం అల్లరి నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’ కూడా రాబోతోంది. ఆఖరి వారంలో రామ్ తన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ను తీసుకురాబోతున్నాడు. దాంతోపాటు కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ కూడా రావాల్సి ఉంది.
ఇక యూఎస్ ప్రిమియర్స్‌ను రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందు వేయాలని తొలుత అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రీమియర్స్ కూడా ముందుకొస్తాయో లేదో చూడాలి. ఇక ఎందుకు ఒక రోజు ముందుకు సినిమా వస్తోంది అనేదేగా డౌట్. ఒక రోజు ముందొస్తే ఓపెనింగ్స్ బలంగా లాగొచ్చు అనే.