‘ఖైదీ’ సినిమా పై మహేష్ కామెంట్స్..!

మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా… మహేష్ ఎప్పుడూ తన సినిమాలని మాత్రమే కాదు.. మిగిలిన హీరోల సినిమాలని కూడా ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తుంటాడు. చిన్న పెద్ద సినిమాలు అని లేదు. నచ్చితే ఏ సినిమాని అయినా తెగ పొగిడేస్తుంటాడు. ఇప్పుడు తన స్నేహితుడైన కార్తీ సినిమా పై కూడా ప్రశంసలు కురిపించాడు.

గతవారం విడుదలైన ‘ఖైదీ’ చిత్రం తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మహేష్.. ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపాడు. ‘కొత్త తరహా చిత్రం అద్భుత నటన మరియు పోరాటాలు, పాటలు లేకుండా సినిమా రావడం ఆహ్వానించదగ్గ మార్పు. హీరో కార్తీ మరియు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ నా అభినందనలు’ అంటూ పేర్కొన్నాడు. ఇక కార్తీ, మహేష్ చెన్నై లో చదువుకునే రోజుల నుండీ క్లాస్ మేట్స్ మరియు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus