టాలెంటెడ్ డైరెక్టర్ ను ఫైనల్ చేసిన మహేష్

నటుడుగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన పరశురామ్ (బుజ్జి) ఆ తరువాత డైరెక్టర్ గా మరి ‘యువత’ ‘ఆంజనేయులు’ ‘సోలో’ ‘సారొచ్చారు’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసాడు. రైటర్ గా.. డైరెక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్న పరశురామ్.. గతేడాది ‘గీత గోవిందం’తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసింది. ‘గీత గోవిందం’ చిత్రం అంత పెద్ద విజయం సాధించడంతో డైరెక్టర్ పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ కథ వినిపించాడు. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పగా.. కొంచెం టైం తీసుకుని ఈమధ్యే మహేష్ వద్దకు వెళ్ళి ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట. మహేష్ కు కథ నచ్చడంతో వెంటనే సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నాడట. ఈ చిత్రంతో కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. కొరటాలకు నిర్మాణం పై ఎంతో ఆసక్తి ఉన్నట్లు గతంలో చాలా సార్లు తెలిపాడు. ఇక మహేష్ తో కొరటాలకి మంచి అనుబంధం ఉంది కాబట్టి…. మహేష్ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలన్నీ కొరటాలకి అప్పగించాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి మహేష్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని కూడా సమాచారం. ఏదైతేనేం.. మహేష్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus