ఈ రెండేళ్లలో నాకు ఇష్టమైన వాళ్ళు దూరమయ్యారు : మహేష్ బాబు

సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ మే 12 న విడుదల కాబోతుంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు మాట్లాడుతూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ” ఈరోజు నాన్న‌గారి అభిమానుల‌కు, నా అభిమానుల‌కు ప‌ర‌శురామ్‌గారు ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అయిపోయారు. స‌ర్కారు వారి పాట సినిమాని నాకు ఇచ్చినందుకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. ఫ్యాన్స్ ను ఇలా కలుసుకుని 2 ఏళ్ళు కావస్తోంది.డైరెక్టర్ పరశురామ్ ఈ మూవీలో నా క్యారెక్టర్‌ని కొత్తగా డిజైన్ చేశారు. నా లుక్‌, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్‌, బాడీ లాంగ్వేజ్ ఇలా టోటల్‌గా ప‌ర‌శురామ్ డిజైన్ చేసింది. చాలా ఎంజాయ్ చేస్తూ వ‌ర్క్ చేశాను. కొన్ని సీన్స్‌ చేస్తుంటే పోకిరి రోజులు గుర్తుకు వ‌చ్చాయి.క‌థ విని ఓకే చేసిన‌ప్పుడు .. ప‌ర‌శురామ్‌గారు ఇంటికెళ్లిన రెండు, మూడు గంట‌ల త‌ర్వాత నాకొక మెసేజ్ పెట్టారు. ఆయ‌న‌కు గుర్తుందో లేదో నాకు తెలియ‌దు. ‘థాంక్యూ సార్‌.. ఒక్క‌డు సినిమా చూసి డైరెక్ట‌ర్ అవుదామ‌ని బండెక్కి హైద‌రాబాద్ వ‌చ్చాను. మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఈ సినిమాను ఎలా తీస్తానో..ఇరగదీసేస్తాను’ అని మెసేజ్ చేసాడు. ఈ రెండేళ్లలో చాలా మారాయి…నాకు ఇష్టమైన వాళ్ళు దూరమైపోయారు, కానీ మీ అభిమానం మాత్రం మారలేదు.ఇది చాలు ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus