టైటిల్ చూడగానే మహేష్ బాబు ఏదైనా సినిమా రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమా ఇప్పుడు మరొక హీరోతో తీయబడి ఫ్లాప్ అయ్యిందేమో అనుకోబాకండి. ఇక్కడ మేటర్ ఏంట్రా అంటే.. మన సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్స్ బిజినస్ లోకి దిగి ఏషియన్ సినిమాస్ తో కలిసి “ఎ.ఎం.బి” అనే మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ అమీర్ ఖాన్-అమితాబ్ బచ్చన్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్”తో జరగాల్సి ఉంది. అయితే.. ఆ సినిమా రిలీజ్ టైమ్ కి థియేటర్ ఇంటీరియర్ ఇంకా పూర్తికాకపోవడంతో.. ఆ సినిమాతో థియేటర్ ను ప్రారంభించలేకపోయారు. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు బిజినెస్ ట్రేడ్స్ మహేష్ పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకొన్నాడు లేకపోతే.. ఒక ఫ్లాప్ సినిమాతో థియేటర్స్ ఆరంభమయ్యేవి అని చెప్పుకొంటున్నారు.
ఇప్పుడు రజనీకాంత్ “రోబో 2.0” చిత్రంతో మహేష్ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుంది. సో, ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉండడం. శంకర్ ఎన్నడూ లేని విధంగా ఆ సినిమా కోసం కష్టపడి ఉండడంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ & బయ్యర్స్. మరి మహేష్ నమ్మకం నిలబడి ఆయన మల్టీప్లెక్స్ ఓపెనింగ్ సూపర్ హిట్ సినిమాతో అవుతుందో లేదో తెలియాలంటే నవంబర్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.