Mahesh Babu: కృష్ణ విగ్రహావిష్కరణ.. థాంక్స్ చెప్పిన మహేష్ ట్వీట్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహవిష్కరణ తాజాగా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా విజయవాడలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా విజయవాడలో కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ ప్రారంభించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వేడుకలలో భాగంగా వైసిపి లీడర్ దేవినేని అవినాష్ కూడా పాల్గొన్నారు. ఇలా విగ్రహవిష్కరణకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15వ తేదీన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.ఇలా కృష్ణ గారు మరణించిన తర్వాత పలుచోట్ల కృష్ణ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా బుర్రపాలెంలో కూడా కృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తాజాగా విజయవాడలో కమల్ హాసన్ చేతులు మీదుగా జరగడంతో ఈ కార్యక్రమం పై మహేష్ బాబు స్పందించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు (Mahesh Babu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ …నాన్న కృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవినేని అవినాష్ అలాగే కమల్ హాసన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన మీ అభిమాన కుటుంబాన్ని మాకు సొంతం చేసి వెళ్లిపోయారు. అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus