Mahesh Babu: నిరాశలో మహేష్ ఫ్యాన్స్.. అసలు కారణమిదే..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 4,000కు అటూఇటుగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ ను విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా వల్ల టీజర్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటన కూడా మే 31వ తేదీన లేనట్టేనని సమాచారం. త్రివిక్రమ్ మహేష్ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన మినహా మరే అప్ డేట్ రాలేదు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు,

సాంకేతిక నిపుణుల వివరాలకు సంబంధించిన ప్రకటన ఈ నెలాఖరుకు వస్తుందని ఫ్యాన్స్ భావించగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వివరాలను రివీల్ చేయడానికి చిత్రయూనిట్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజుకు సర్ ప్రైజులు ఉంటాయని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగులుతుండటం గమనార్హం. సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే సిద్ధమైనా మహేష్ సూచన మేరకు టీజర్ రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus