‘మహర్షి’ తరువాత మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి (జనవరిలో) కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ‘ఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ చిత్రాలతో హిట్లందుకున్న మహేష్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వారికి ఓ విషయంలో సంతృప్తి కలగడం లేదంట.
దాదాపు 30 ఏళ్ళ తరువాత మహేష్ తో విజయశాంతి ఈ చిత్రంలో కనిపించబోతుంది. ఇక విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడట. ఇంతటి భారీ కాస్టింగ్ ను తీసుకున్న అనిల్ ఒక్క రష్మిక మందన ను మాత్రం హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నాడా అని వారు బాధపడుతున్నారట. మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్లే పెద్దగా ఆనరు. అందుకే ఆయన మొదటి చిత్రంలో హీరోయిన్ గా ప్రీతీ జింటా ను తీసుకొచ్చాడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు. అంతేనా కృష్ణవంశీ కూడా అప్పటి బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే ను తీసుకొచ్చాడు. ఇక బిపాసా, అమీషా పటేల్, కృతి సనన్ వంటి భామలు సైతం మహేష్ ముందు తేలిపోయారనే చెప్పుకోవాలి. మహేష్ గ్లామర్ అలాంటిది మరి. ‘భరత్ అనే నేను’ లో నటించిన కియారా అద్వానీ మాత్రమే కాస్త బాగుందనే కామెంట్స్ వినిపించాయి. ఓ రేంజ్లో అందాల ఆరబోతలు చేసే పూజా హెగ్దే కూడా మహేష్ సరసన అస్సలు సెట్టవ్వలేదని ‘మహర్షి’ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేసారు. దీంతో ఇప్పుడు రష్మిక ను హీరోయిన్ గా ఎంచుకోవడం అంటే అభిమానులు నిరాశ చెందారు. మొదట్లో ఈ పాత్ర కోసం సాయి పల్లవి పేరు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా అభిమానులు.. కంగారు పడ్డారు. సాయి పల్లవి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో మహేష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు రష్మిక విషయంలో వారికి నిరాశ తప్పలేదు. అయితే రష్మిక మంచి పెరఫార్మర్ కాబట్టే అనిల్ ఈమెను తీసుకుని ఉండుంటాడు అనడంలో కూడా అతిశయోక్తిలేదు. సినిమా హిట్టయితే మళ్ళీ అభిమానులే రష్మిక ను పొగిడే అవకాశం కూడా ఉంది.