పూజా హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ అభిమానులు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అంతగా సంతృప్తి ఇవ్వలేకపోయింది. పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ కొత్త మూవీ మహర్షి ఫస్ట్ లుక్, టీజర్ ఎంతో ఆనందాన్ని కలిగించాయి. కానీ మహేష్ ని హీరోయిన్స్ ని అగౌర పరచడం మాత్రం బాధని కలిగించాయి. ఆగ్రహాన్ని తెప్పించాయి. వివరాల్లోకి వెళితే.. యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్ర బృందాన్ని ట్విట్టర్ వేదికపై ప్రశంసించారు. అందులో హీరోయిన్ గా నటించిన శోభిత ధూళిపాల మహేష్ ట్వీట్ కు కృతజ్ఞతగా “థ్యాంక్ యు” అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో మహేష్ అభిమానులు హర్ట్ అయ్యారు. కనీసం గౌరవం ఇవ్వకుండా ఆ సమాధానమేంటి? అని ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా పూజాహెగ్డే మ‌హేష్ ని మర్యాద లేకుండా పిలిచి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. మ‌హేష్ పుట్టినరోజు సంద‌ర్భంగా “మా రుషికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు” అని పూజా ట్వీట్ చేసింది. ఇలా ట్వీట్ చేయడం మ‌హేష్ అభిమానులు నచ్చలేదు. మ‌హేష్‌ను `స‌ర్‌` అని పిలవలేదని, అంతేకాకుండా “హ్యాపీ బ‌ర్త్‌డే టూ మ‌హేష్‌” అని హ్యాష్ ట్యాగ్ కూడా జోడించ‌లేద‌ని ఫీల‌వుతున్నారు. అందుకే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్ మహేష్ ని సార్ అని పిలవకపోవడం అతను బాధపడ్డారో, లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం బాధపడిపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus